సారంగపాణి జాతకం... టీజర్‌ ప్రకటన భలే ఉంది!

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ప్రియదర్శి, రూప కొడువయూర్ జంటగా ‘సారంగపాణి జాతకం’ నుంచి ఇప్పటికే సారంగో సారంగా అంటూ హుషారుగా సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్‌తో అందరినీ మెప్పించింది. ఇప్పుడు ఈ సినిమా టీజర్‌ విడుదల కాబోతోంది. కానీ ఈ విషయం తెలియజేసిన విధానం, రొటీన్కు భిన్నంగా ఆవిదంగా కూడా తమ సినిమా అప్‌డేట్‌ ఇవ్వొచ్చనే ఆలోచన అద్భుతంగా ఉన్నాయి.

ఓ చెట్టు కింద ప్రియదర్శి పంచాంగం పుస్తకం పట్టుకొని పేజీలు తిరగేస్తుండగా చెట్టుపైన కాకి కావుకావుమని అరుస్తుంటే, ఛా ముఖ్యమైన పని మీదుంటే మద్యలో ఈ కాకిగోల ఏమిటి?అని విసుక్కుంటాడు.

అప్పుడు ఆ కాకి నేనురా నీ తాతని ఇలా నిన్ను చూసి పోదామని వచ్చాను... ఏం చేస్తున్నావురా...?అంటూ పలకరించడం అప్పుడు కాకి రూపంలో ఉన్న ఆ తాత మనవళ్ళ ముచ్చటలో సారంగపాణి జాతకం సినిమా గురించి చెప్పుకోవడం, చివరిగా టీజర్‌కి ముహూర్తం ఇదీ... ఇక మనకి అన్నీ మంచిరోజులే...” అంటూ ప్రియదర్శి చెప్పడం... అప్పుడు ఆ కాకి “ఉండు ఊళ్ళో అందరికీ ఈవిషయం చెప్పొస్తాను,” అంటూ ఎగిరిపోవడం చాలా సజహంగా... చాలా బాగుంది. ప్రియదర్శి పోస్ట్ చేసిన ఈ వీడియో చూసి మీరు ఆనందించండి.

సారంగపాణి జాతకం టీజర్‌ నవంబర్‌ 21వ తేదీన ఉదయం 11.21 గంటలకు విడుదల కాబోతోంది.  ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, వివా హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్, వికె నరేశ్, రాజా చెంబోలు, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేశ్ రెడ్డి, కల్పలత, రూప లక్ష్మి, హర్షిణి, కెఎల్‌కె మణి, ఐమాక్స్ వెంకట్ ముఖ్యపాత్రలు చేశారు.

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: ఇంద్రగంటి మోహనకృష్ణ, సంగీతం: వివేక్‌ రామస్వామి సాగర్, కెమెరా: పీజీ విందా, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్, స్టంట్స్‌: వెంకట్, వెంకటేష్ చేశారు. శ్రీదేవీ మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్‌ 20న విడుదల కాబోతోంది.

మన సారంగపాణికి ముందున్నవన్నీ మంచి రోజులేనంట, అందుకే...

Bringing you the #SarangapaniJathakam Teaser on Nov 21st, 11:12AM 🖐️🤩

Await a KILLER COMEDY on Dec 20th💥😉#MohanaKrishnaIndraganti @PriyadarshiPN @RoopaKoduvayur @pgvinda #MarthandKVenkatesh #VivekSagar @krishnasivalenk… pic.twitter.com/K3gNV5RpWy
— Aditya Music (@adityamusic) November 17, 2024