
ఆదివారం సాయంత్రం బిహార్ రాజధాని పాట్నాలో పుష్ప-2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరుగబోతోంది. దాని కోసం నిర్వాహకులు చాలా భారీ ఏర్పాట్లు చేశారు. దీని కోసం పాట్నాలో గాంధీ మైదానంలో భారీ వేదికని ఏర్పాటు చేశారు. దానిని చూసేందుకు, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పాసుల కోసం బీహార్ యువత క్యూ కడుతున్నారు.
అల్లు అర్జున్ నటించిన పుష్ప-1 సినిమాని బిహార్‌లో సూపర్ హిట్ చేశామని, పుష్ప-2ని అంతకు మించి సూపర్ హిట్ చేస్తామని చెపుతున్నారు. డిసెంబర్ 5న పుష్ప-2 సినిమా విడుదలైనప్పుడు తుపాకులు పేల్చి ఘనస్వాగతం పలుకుతామని అంటున్నారు.
అల్లు అర్జున్ దక్షిణాదికి చెందిన నటుడే అయినా పుష్ప-1తో తమ మనసులు దోచుకున్నాడని బిహార్ యువత చెపుతున్నారు. పుష్ప సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఇప్పటికే వేలాదిమంది పాసులు తీసుకున్నారు. దొరకనివారు నిర్వాహకుల చుట్టూ తిరుగుతూ ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు.
పుష్ప సినిమా బిహార్ ప్రజలకు నచ్చడానికి ఆ సినిమా కధ, కాన్సెప్ట్, ముఖ్యంగా అల్లు అర్జున్ నటన అనేక కారణాలు కనిపిస్తున్నా ఆ సినిమాలో తమ రాష్ట్రంలో నెలకొన్న కొన్ని పరిస్థితులను, తమ బాధలను, పోరాటాలను, తమ సంస్కృతిని ప్రతిభింబిస్తోందని కొందరు యువకులు చెప్పడం విశేషం.
కనుక పుష్ప-2 బిహార్‌తో సహా ఉత్తరాది రాష్ట్రాలలో సూపర్ డూపర్ హిట్ అవడం ఖాయమే. పుష్ప-2 అమెరికాలో ఒకరోజు ముందుగా అంటే డిసెంబర్ 4వ తేదీన విడుదల కాబోతుండగా భారత్‌లో మర్నాడు అంటే డిసెంబర్ 5న విడుదల కాబోతోంది.