మరో సీక్వల్ ప్లాన్లో జక్కన్న..!

దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం బాహుబలి-2 షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. తను తీసే ప్రతి సినిమాకు తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించడం తెలిసిందే. అయితే జక్కన్న డైరక్షన్లో వచ్చిన విక్రమార్కుడు అటు రవితేజకు ఇటు రాజమౌళికి మంచి హిట్ కిక్ ఇచ్చింది. మాస్ మహరాజ్ ను యాంగ్రీ యంగ్ మ్యాన్ గా చూపించిన జక్కన్న ఆ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ షురూ చేశాడు. 

ఇక విజయేంద్ర ప్రసాద్ ఆలోచనల్లో ఆ సినిమా సీక్వల్ గా విక్రమార్కుడు-2 కథ ఉన్నదట. ఇప్పటికే దానికి సంబందించిన ఓ లైన్ రాసుకున్నట్టు టాక్. రాజమౌళి బాహుబలి కంక్లూజన్ పూర్తి చేశాక తనతో చర్చించి ఆ సినిమా ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఫాం కోల్పోయిన రవితేజ ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే మళ్లీ పుంజుకునే ఛాన్స్ ఉంది.

రాజమౌళి సినిమా అంటే ఇప్పుడు కేవలం సౌత్ లోనే కాదు దేశంలోనే మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా జక్కన్నకు ఫ్యాన్స్ ఏర్పడ్డారనుకోండి. ఏది ఏమైనా విక్రమార్కుడు-2 తీస్తే ఆ సినిమా పెద్ద సంచలనం అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.