
పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన సినిమాలలో ఓజీ కూడా ఒకటి. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న తమన్ ‘ఓజీ’కి సంబందించి కొన్ని కొత్త విషయాలు చెప్పారు.
ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయిందని జనవరి నుంచి అప్‌డేట్ ఇవ్వడం ప్రారంభిస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ పియానో అద్భుతంగా వాయిస్తాడు. కనుక ఈ సినిమాలో ఓ పాటకి అతని చేత పియనో వాయింపజేసేందుకు ప్రయత్నిస్తున్నానని తమన్ చెప్పారు. ప్రముఖ సంగీత దర్శకుడు, నేపద్య గాయకుడు రమణ గోగుల ఒకవేళ అంగీకరిస్తే ఆయన చేత ఈ సినిమాలో ఓ పాట పాడించాలనుకుంటున్నానని ధమన్ చెప్పారు.
సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ‘ఓజీ’లో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు. శుభలేఖ సుధాకర్, ప్రకాష్ రాజ్, అజయ్ ఘోష్, అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి, హరీష్ శంకర్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: సుజీత్, సంగీతం: థమన్; కెమెరా: రవి కె చంద్రన్; ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.