నయనతార జీవిత విశేషాలు తెలియజేస్తూ నెట్‌ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీ తీసింది. అది ఈ నెల 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కాబోతోంది. ఇటీవలే దాని ట్రైలర్ విడుదలైంది. ఈ డాక్యుమెంటరీ వలన కోలీవుడ్ అగ్రనటులు ధనుష్-నయన్ దంపతులకు మద్య జరుగుతున్న గొడవలు బయటపడ్డాయి.
విగ్నేష్ శివన్ దర్శకత్వంలో 2015లో విజయ్ సేతుపతి-నయనతార జంటగా ‘నానుం రౌడీ దాన్’ (తెలుగులో నేను రౌడీ) సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా వార్రు ముగ్గురికీ చాలా మంచి పేరు వచ్చింది. వారి సినీ కెరీర్‌లో అదో మైలురాయి అని చెప్పవచ్చు. కనుక నయనతారపై తీస్తున్న డాక్యుమెంటరీ ఆ సినిమా క్లిప్పింగ్ కూడా పెట్టాలనుకున్నారు. కానీ ధనుష్ అనుమతి కోరితే తిరస్కరించారు.
కనీసం ఆ సినిమాలో ఓ పాట లేదా చిన్న బిట్ పెట్టుకునేందుకు అనుమతివ్వాలని కోరినా ధనుష్ అంగీకరించలేదు. తన అంచనాలకు భిన్నంగా ఆ సినిమా సూపర్ హిట్ అవడం, దాంతో నయన్ దంపతులకు మంచి పేరు రావడంతో ధనుష్ అసూయతో రగిలిపోతున్నారని అందుకే అనుమతివ్వలేదంటూ నయనతార ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు.
ధనుష్ సినీ వేదికలపై తనను తాను చాలా గొప్పగా ఊహించుకుంటూ మాట్లాడినా ఆయన స్థాయి దానిలో సగం కూడా ఉండదని నయనతార వ్యంగ్యంగా విమర్శించారు.
ఎప్పుడో 9 ఏళ్ళ క్రితం విడుదలైన అ సినిమా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. దాని నుంచి ఓ మూడు సెకన్లు నిడివి కలిగిన చిన్న బిట్ తీసుకొని నయనతార డాక్యుమెంటరీలో జోడించి ట్రైలర్ విడుదల చేశారు. అందుకు ధనుష్ ఆమెకు లీగల్ నోటీస్ ఇచ్చి రూ.10 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. అందుకే నయనతార ధనుష్ నీచ స్వభావాన్ని బయటపెడుతూ సోషల్ మీడియాలో రెండు పేజీల బహిరంగ లేఖని పోస్ట్ చేశారు.