
విశ్వక్ సేన్, మీనాక్షీ చౌదరి జంటగా చేసిన ‘మెకానిక్ రాఖీ’ ఈ నెల 22న విడుదల కాబోతోంది. ఈ సినిమాతో ముళ్ళపూడి రవితేజ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటి వరకు విడుదలైన పాటలు, ట్రైలర్ 1.0 చూస్తే దమ్మున్న దర్శకుడే అనిపిస్తుంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌లో భాగంగా నేటి నుంచి 22వరకు వరుసపెట్టి కార్యక్రమాలలో పాల్గొనబోతున్నారు.
రేపు వరంగల్‌లో మెకానిక్ రాఖీ ట్రైలర్ 2.0 విడుదల చేయబోతున్నారు. 18వ తేదీన తన సినిమా టీమ్‌తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోబోతున్నారు. ఆదేరోజు తిరుపతి పట్టణంలో కాలేజీ విద్యార్ధులతో ముఖాముఖీ మాట్లాడబోతున్నారు. మేఖనిక్ రాఖీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈ నెల 20న జరుగబోతోంది. నవంబర్ 21న ఏఎంబీ రెడ్ కార్పెట్ ప్రీమియర్, 22న హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో అభిమానులతో కలిసి విశ్వక్ సేన్ తన సినిమా మొదటి షో చూడబోతున్నారు.
మెకానిక్ రాఖీ ట్రైలర్ 1.0 చాలా అద్భుతంగా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరగడమే కాకుండా రేపు వరంగల్‌లో విడుదల చేయబోయే ట్రైలర్ కోసం అందరూ ఎదురుచూసేలా చేసింది కూడా.
ఈ సినిమాలో సునీల్, నరేశ్ వికె, హైపర్ ఆది, హర్ష వర్ధన్, వివ హర్ష, రఘురాం తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: రవితేజ ముళ్ళపూడి, పాటలు: సుద్ధాల అశోక్ తేజ, కృష్ణ చైతన్య, సనరే, కెమెరా: మనోజ్ రెడ్డి కాటసాని, కొరియోగ్రఫీ: భాను, యష్, యాక్షన్: సుప్రీం సుందర్, ఎడిటింగ్: అన్వర్ అలీ చేశారు. స్తున్నారు. ఈ సినిమాని ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ తాళ్ళూరి నిర్మించారు.