
మళ్ళీ చాలా రోజుల తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్, రష్మిక మందన ప్రధాన పాత్రలలో వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘కుబేర.’ ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ ఈరోజు విడుదలయ్యింది. ఈ సినిమా పేదలు, ధనికులు, డబ్బు చుట్టూ అల్లుకున్న కధ అని అర్దమవుతూనే ఉంది. నాగార్జున ధనవంతుడు కాగా ధనుష్ ఓ సామాన్య వ్యక్తి. వారిద్దరి మద్యలో రష్మిక పాత్ర ఏమిటో ఇంకా తెలియవలసి ఉంది. ఫస్ట్ గ్లిమ్స్ బాగానే ఉంది కానీ కానీ కాస్త అయోమయం సృష్టించింనట్లనిపిస్తుంది. బహుశః సినిమా టీజర్‌లో కధ గురించి ఏమైనా క్లూ ఇస్తారేమో చూడాలి.
ఈ సినిమాలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన, జిమ్ సరబ్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. కుబేరకి కధ: శేఖర్ కమ్ముల, చైతన్య పింగళి, దర్శకత్వం: శేఖర్ కమ్ముల, సంగీతం: దేవి శ్రీప్రసాద్, కెమెరా: నికేత్ బొమ్మి చేస్తున్నారు.
శ్రీ వేంకటేశ్వర సినిమాస్, ఎల్ఎల్పి అమిగోస్ క్రియెషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కుర్ రాంమోహన్ రావు కలిసి ఈ సినిమాని 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. సినిమా విడుదల తేదీ ఇంకా ప్రకటించాల్సి ఉంది.