
ఇటీవల తెలుగు సినిమా పేర్లు కొన్ని అచ్చతెలుగులో కొన్ని చిత్రవిచిత్రంగా, కొన్ని ఆలోచింపజేసేవిగా ఉంటున్నాయి. అటువంటిడే ‘డ్రింకర్ సాయి’ కూడా. ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా కిరణ్ తుమ్మలశెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఈరోజు విడుదలైంది. టీజర్ కాన్సెప్ట్ చూస్తే విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగా తీసిన అర్జున్ రెడ్డి సినిమా కళ్ళ ముందు మెదిలితే ఆశ్చర్యం లేదు. కానీ ఈ సినిమాలో హీరోహీరోయిన్ల చేత కాస్త రొమాన్స్, కాస్త కామేడీ చేయించారు. కనుక ఈ సినిమా కధ, కాన్సెప్ట్ రెండూ అర్జున్ రెడ్డి కాదనే అనుకోవచ్చు.
ఈ సినిమాలో పోసాని కృష్ణ మురళి, శ్రీకాంత్ ఓదెల అయ్యంగార్, సమీర్, బధ్రమ్, కిర్రాక్ సీత, ఎస్ఎస్ కాంచీ, రీతూ చౌదరి, ఫన్ బకెట్ రాజేష్, రాజా ప్రజ్వల్ ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: కిరణ్ తిరుమలశెట్టి, సంగీతం: శ్రీ వసంత్, కెమెరా: ప్రశాంత్ అంకిరెడ్డి, ఆర్ట్: లావణ్య వేములపల్లి, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్, కొరియోగ్రఫీ: మొయిన్, భాను; యాక్షన్: కృష్ణంరాజు చేశారు.
ఈ సినిమాని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై బసవరాజు శ్రీనివాస్, బసవరాజు లాహిరిదర్, ఇస్మాయిల్ షేక్ కలిసి నిర్మించారు.