ప్రభాస్‌తో సినిమా అంటే ఇప్పుడు పాన్ ఇండియా మూవీయే. ఓ 500-1,000 కోట్లు బడ్జెట్ మామూలే. అంత భారీ సినిమాలు చేస్తున్నా ఏడాదికి ఒకటో రెండో సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటూ ప్రేక్షకులను అభిమానులను పలకరిస్తూనే ఉన్నారు.
ఇప్పుడు ప్రభాస్-మారుతి కాంబినేషన్‌లో ‘రాజాసాబ్’, మంచు విష్ణు సినిమా ‘కన్నప్ప’, హనుమాన్ రాఘవపూడితో ఓ సినిమా (ఫౌజీ), సందీప్ వంగా రెడ్డితో ‘స్పిరిట్’, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్-2, నాగ్ అశ్విన్‌తో కల్కి ఎడి2898-2 సినిమాలను లైన్లో పెట్టారు. ఇవికాక ఇటీవలే హోంభోలే నిర్మాణ సంస్థతో 2026,27,28 సంవత్సరాలలో మూడు సినిమాలు చేసేందుకు ఒప్పుకున్నారు. ఇవన్నీ కాక బాహుబలి-3 ఉండనే ఉంది.
ఇదివరకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, చిరంజీవి వంటి అతికొద్ది మంది మాత్రమే ఏడాదిలో అనేక సినిమాలు చేసి విడుదల చేయగలిగేవారు.
ఇప్పుడు టాలీవుడ్లో పాన్ ఇండియా మూవీ ట్రెండ్ మొదలైనప్పటి నుంచి పెద్ద హీరోయలందరూ ఓ సినిమాకి కనీసం రెండు మూడేళ్ళు తీసుకుంటున్నారు.
ఆ స్థాయిలో ఉన్న ప్రభాస్ ఇన్ని సినిమాలు ఎలా చేయగలుగుతున్నారు? ఎప్పుడు పూర్తి చేస్తారు? అనే సందేహం కలగడం సహజమే.
కానీ ప్రభాస్-సందీప్ రెడ్డి వంగాల కాంబినేషన్‌లో స్పిరిట్ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయని వచ్చే నెల(డిసెంబర్)లో పూజా కార్యక్రమం చేసి 2025 జూన్‌లోగా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతామని ఈ సినిమా నిర్మాత భూషణ్ కుమార్ చెప్పారు.
ఇప్పటికే ‘స్పిరిట్’ సంగీత దర్శకుడు హర్షవర్ధన్ కామేశ్వర్ రెండు పాటలు రికార్డ్ చేశారని చెప్పారు. స్పిరిట్ సినిమా షూటింగ్ ఆరు నెలల్లో, మిగిలిన పనులు మరో ఆరు నెలల్లో పూర్తిచేసి 2026 ఆగస్ట్-సెప్టెంబర్‌లోగా సినిమా విడుదల చేసేవిదంగా ప్లాన్ చేసుకుంటున్నామని నిర్మాత భూషణ్ కుమార్ చెప్పారు. ప్రభాస్ అభిమానులకు ఇంతకంటే సంతోషకరమైన వార్త ఏముంటుంది.