
నితిన్, శ్రీలీల హీరోయిన్లుగా వస్తున్న ‘రాబిన్‌హుడ్’ సినిమా టీజర్ ఈరోజు (గురువారం) సాయంత్రం 4.05 గంటలకు విడుదల కాబోతోంది.
ఆనాటి రాబిన్‌హుడ్ కధలో హీరో డబ్బున వారిని దోచుకొని ఆ సొమ్ముని సమాజంలో పేదలకు పంచిపెట్టేవాడు. కనుక రాబిన్‌హుడ్ సినిమా టైటిల్‌తోనే కధేమిటో దర్శకుడు వెంకీ కుడుమల చెప్పేశారు.
అయితే అదే కధ అయితే జనాలకు ఎక్కదు. కనుక శ్రీలీలతో రాబిన్‌హుడ్ రొమాన్స్, వెన్నెల కిషోర్ కామెడీని కూడా జోడించి తీస్తున్నారు. ఇటువంటి కధలు, సినిమాలు వారందరికీ ముఖ్యంగా నితిన్‌కి కొట్టిన పిండే కనుక రాబిన్‌హుడ్ అందరినీ అలరిస్తారనే భావించవచ్చు. ఈరోజు టీజర్‌తో ఆ విషయం స్పష్టమవుతుంది.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారంటే ఈ సినిమాపై వారు ఎంత నమ్మకం పెట్టుకున్నారో అర్దం చేసుకోవచ్చు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: వెంకీ కుడుముల, సంగీతం: జీవి ప్రకాష్, కెమెరా: సాయి శ్రీరామ్, ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్, ఎడిటింగ్: కోటి చేస్తున్నారు.
ఈ సినిమా డిసెంబర్ 20వ తేదీన విడుదలచేయాలనుకున్నారు. కానీ డిసెంబర్ 5న పుష్ప-2 వస్తుండటంతో దానికి మరికాస్త దూరంగా జరిగి క్రిస్మస్ రోజున అంటే డిసెంబర్ 25న లేదా ముందు రోజున రాబిన్‌హుడ్ థియేటర్లలో దిగే అవకాశం ఉంది. ఈరోజు టీజర్లో రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చేస్తారు.