రష్మిక పుష్ప-2 అప్‌డేట్‌ ఇచ్చింది విన్నారా?

డిసెంబర్‌ 5న విడుదల కాబోతున్న పుష్ప-2 కోసం అభిమానులే కాదు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. విదేశాలలో స్థిరపడిన భారతీయులైతే సరేసరి. ఈ నెల 14న పాట్నాలో పుష్ప-2 ట్రైలర్‌ విడుదలైతే సినిమాకి మరింత హైప్ వస్తుంది కూడా. 

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్‌గా చేస్తున్న రష్మిక మందన పుష్ప-2 గురించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలు అభిమానులతో పంచుకుంది. పుష్ప-2 ఫస్ట్ ఆఫ్ అద్భుతంగా ఉంటుందని, సెకండ్ హాఫ్ ఇంకా అద్భుతంగా ఎవరూ ఊహించని స్థాయిలో ఉంటుందని తెలిపింది.

ఈ సినిమా విడుదల కోసం తాను కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నానని చెప్పింది. సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తయిపోయిందని చెప్పింది.

షూటింగ్‌ జరుగుతున్ననాళ్ళు చాలా సరదాగా రోజులు, నెలలు గడిచిపోయాయని చెప్పింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పింది. ఫస్ట్ ఆఫ్‌లో తన పాత్రకి డబ్బింగ్ చెప్పడం పూర్తిచేశానని ప్రస్తుతం సెకండ్ హాఫ్ డబ్బింగ్ చేస్తున్నానని రష్మిక మందన చెప్పింది. 

పుష్ప-1 లో అల్లు అర్జున్‌, రష్మిక ఫ్రేమికులుగా నటించగా పుష్ప-2లో ఇద్దరూ పెళ్ళి చేసుకొని భార్య భర్తలుగా మారుతారు. అలాగే పుష్ప-2లో సాదాసీదా నిరుపేద పల్లెటూరి అమ్మాయిగా కనిపించిఒన రష్మిక పుష్ప-2లో ఒంటి నిండా బంగారు ఆభరణాలు, పట్టుచీరతో ధనవంతురాలైన మహిళగా కనువిందు చేయనుంది. 

పుష్ప-2లో ఐటెమ్ సాంగ శ్రీలీల చేస్తున్న సంగతి తెలిసిందే. ట్రైలర్‌ తర్వాత డిసెంబర్‌లో ఈ పాట విడుదల చేయనున్నారు. 

పుష్ప-2 ప్రపంచవ్యాప్తంగా 11,500 స్క్రీన్స్ లో ఒకేసారి విడుదల కాబోతోంది. దీనిలో భారత్‌లో 6,500 స్క్రీన్స్ కాగా విదేశాలలో ఏకంగా 5,000 స్క్రీన్స్ లో విడుదల కాబోతుండటం గమనిస్తే పుష్ప-2కి ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అర్దం చేసుకోవచ్చు.