
అలా ఎలా.. సినిమాతో ఎంట్రీ ఇచ్చినా ఆ సినిమా తర్వాత వచ్చిన కుమారి 21f తోనే ఓ రేంజ్ పాపులారిటీ సంపాదించింది హెబ్భా పటేల్. తన హాట్ స్కిన్ షోతో కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేసిన ఈ అమ్మడు ఛాన్స్ వస్తే రాజ్ తరుణ్ తో డేటింగ్ చేస్తా అంటుంది. కుమారి 21f, ఈడోరకం ఆడోరకం సినిమాల్లో కలిసి నటించిన రాజ్ తరుణ్, హెబ్భా పటేల్ లు ప్రస్తుతం ఎవరి ప్రాజెక్టుల్లో వారు బిజీగా ఉన్నారు. ఈ వారం నిఖిల్ తో ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో వస్తున్న హెబ్భా పటేల్ ఆ సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ లో రాజ్ తరుణ్ తో డేట్ విషయంపై క్లారిటీ ఇచ్చింది.
నిఖిల్, రాజ్ తరుణ్ లలో ఎవరితో డేట్ కు వెళ్తారని యాంకర్ అడుగగా క్షణం కూడా లేట్ చేయకుండా రాజ్ పేరు చెప్పింది అమ్మడు. నిఖిల్ ఏమైనా అనుకుంటాడేమో అన్న ఫీలింగ్ కూడా లేకుండా తన మనసులోని మాట చెప్పేసింది. అయితే మొన్నామధ్యలో రాజ్, హెబ్భా మధ్య గొడవలయ్యాయి అన్న టాక్ వచ్చినా అమ్మడు డేటింగ్ అంటూ ఉంటే అది రాజ్ తోనే అంటుంది కాబట్టి ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తుంది. మరి అమ్మడి కోరిక రాజ్ తరుణ్ తీరుస్తాడో లేదో చూడాలి.