
ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ ‘దేవకీ నందన వాసుదేవ’తో ‘దేవకీ నందన వాసుదేవ’తో ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి కధ అందించగా, అర్జున్ జంద్యాల దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమా ట్రైలర్ నేడు హైదరాబాద్ ప్రముఖ నటుడు రానా విడుదల చేశారు. ఇదో సోషియో ఫాంటసీ సినిమా అని రానా చెప్పేశారు. ట్రైలర్‌లో కూడా అదే చెప్పారు.
భాగవత గాధలో దేవకీ, వాసుదేవల 8వ సంతానంగా జన్మించిన శ్రీకృష్ణుడు పెరిగి పెద్దవాడై దుష్టుడైన మేనమామ కంసుడిని సంహరిస్తాడు. ఆ కధనే నేటి కాలానికి అన్వయించి తీసిన సినిమా ఇదని ట్రైలర్‌లో చెప్పేశారు. కనుక ఈ సినిమాలో మంచి యాక్షన్ సీన్స్, రొమాన్స్ సీన్స్ దండిగా ఉంటాయని వేరే చెప్పక్కరలేదు.
ఈ సినిమాలో తెలుగమ్మాయి మానస వారణాశి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరియో, కెమెరా: ప్రసాద్ మూరెళ్ళ, రసూల్ ఎల్లోర్, ఎడిటింగ్: తమ్మిరాజు, డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా, ఆర్ట్: జీఎం శేఖర్ చేశారు. లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కాబోతోంది.