ఏషియా యూత్ ఐకాన్ చరణ్

మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఈ సంవత్సరం యూత్ ఐకాన్ అవార్డ్ అందుకోబోతున్నారు. ఏషియా విజన్ అవార్డ్స్ లో భాగంగా టాలీవుడ్ కు సంబందించిన యూత్ ఐకాన్ గా చెర్రి అవార్డ్ దక్కించుకున్నాడు. ఇక హీరోయిన్ కేటగిరిలో మిల్కీ బ్యూటీ తమన్నా బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ అందుకుంటుంది. యూ.ఏ.ఈలో షార్జా స్టేడియంలో ఈ నెల 18న జరుగనున్న ఈ కార్యక్రమంలో అవార్డ్ విన్నింగ్ స్టార్స్ అంతా ఈవెంట్ లో పాల్గొననున్నారు.

బ్రూస్ లీ ఫ్లాప్ అయినా సోషల్ మీడియాలో తన లేటెస్ట్ సినిమా అప్డేట్స్ తో రాం చరణ్ ఫ్యాన్స్ తో టచ్ లోనే ఉన్నాడు. ఇక డిసెంబర్ లో సినిమా కూడా రిలీజ్ చేయబోతున్నారు. తని ఒరువన్ రీమేక్ గా వస్తున్న ధ్రువ సినిమా చెర్రి స్టామినా ఏంటో తెలియచేస్తుందని అంటున్నారు. ఈ సినిమా హిట్ తో మళ్లీ ట్రాక్ ఎక్కాలని చూస్తున్న చరణ్ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందో లేదో చూడాలి.