కొత్త దర్శకుడు, కొత్త హీరోయిన్‌తో కొత్త సినిమా!

'మేం ఫేమస్' సినిమాతో దర్శకుడు, హీరోగా సినీ పరిశ్రమలో ప్రవేశించిన సుమంత్ ప్రభాస్‌, తన రెండవ సినిమాని కొత్త దర్శకుడు సుభాష్ చంద్రతో ‘రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్’ అనే కొత్త సినీ నిర్మాణ సంస్థతో చేస్తున్నాడు. ఈ సినిమాలో నిధీ ప్రదీప్ హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు.

ఈ బ్యానర్‌లో ప్రొడక్షన్ నంబర్‌:1 సినిమాకి అది ఉదయం హైదరాబాద్‌లో రామానాయుడు స్టూడియోలో గల ఆలయంలో పూజా కార్యక్రమం జరిగింది.

ప్రముఖ నటుడు శ్రీవిష్ణు హీరో, హీరోయిన్లపై క్లాప్ కొట్టగా, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్‌ చేశారు. దర్శకులు శ్రీకాంత్ ఓదెల, శౌర్యువ్, పి. మహేష్ బాబు గౌరవ దర్శకత్వం చేశారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్క్రిప్ట్ ని దర్శకుడు సుభాష్ చంద్రకు అందజేశారు. సుమంత్ ప్రభాస్‌ మొదటి సినిమా పూర్తి చేసిన తర్వాత 85-86 కధలు విన్నానని చివరికి సుభాష్ చంద్ర చెప్పిన ఈ కధ అద్భుతంగా అనిపించడంతో వెంటనే ఫైనల్ చేశానని చెప్పారు. 

ఈ సినిమాలో జగపతి బాబు, రాజీవ్ కనకాల, హర్షవర్ధన్, సుదర్శన్, రాజ్‌ కుమార్‌ కసిరెడ్డి, వివ రాఘవ్, రీనూ, రోహిత్ కృష్ణ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు సంగీతం: నాగవంశీ కృష్ణ, కెమెరా: సాయి సంతోష్, ఎడిటింగ్: అనిల్ కుమార్‌ చేస్తున్నారు. 

త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ మొదలవుతుంది. ఈ సినిమాలో ఎక్కువ భాగం ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలో తీయబోతున్నట్లు తెలిపారు.