మట్కా ట్రైలర్‌ అదిరిపోయింది!

కరుణ కుమార్‌ దర్శకత్వంలో వరుణ్ తేజ్ చేస్తున్న ‘మట్కా’ సినిమా ట్రైలర్‌ శనివారం మధ్యాహ్నం విడుదలైంది. టీజరే అద్భుతంగా ఉందనుకుంటే ట్రైలర్‌ ఇంకా అద్భుతంగా ఉంది.  

1958-82 మద్య కాలంలో మట్కా జూదం, కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఓ గ్యాంబ్లర్‌గా నటిస్తున్నాడు. కనుక ఆనాటి వాతావరణం, మేకప్, డ్రెస్సులు, ఫైట్స్, వాటికి తగ్గట్టుగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ అద్భుతంగా కుదిరాయని ట్రైలర్‌ చూస్తే అర్దమవుతుంది. ముఖ్యంగా “మనం ఆశని అమ్ముతామ్... నమ్మకాన్ని కొంటామ్”, “వేలుతీసుకొని వదిలేయడానికి నేనేమీ ద్రోణాచార్యుడిని కాను వాసుని” వంటి డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి.  

ఈ సినిమాలో హీరోయిన్లుగా మీనాక్షీ చౌదరి, నోరా ఫతేహీ చేస్తున్నారు. నవీన్ చంద్ర, కన్నడ కిషోర్, అజయ్ ఘోష్, మైమ్ గోపీ, రూపాక్షి, విజయరామ రాజు, జగదీష్, రాజ్‌ తిరాందాస్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటించారు. 

ఈ సినిమాకు కధ, డైలాగ్స్, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: కరుణ కుమార్, సంగీతం: జీవీ ప్రకాష్, కెమెరా: కిషోర్ కుమార్‌, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్ అందించారు.

పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో తెరకెక్కిస్తున్న ‘మట్కా’ వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై విజేందర్ రెడ్డి, రజని తాళ్ళూరి కలిసి నిర్మించారు. మట్కా నవంబర్‌ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. 

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/FKtnAhHnfUo?si=Oe-sDVGwIf2qK57W" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>