మట్కా ట్రైలర్‌ రేపు మధ్యాహ్నం 12.06 గంటలకి...

వరుణ్ తేజ్, మీనాక్షీ చౌదరి జోడీగా వస్తున్న 'మట్కా' పీరియాడికల్ మూవీ ఈ నెల 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో రేపు మధ్యాహ్నం 12.06 గంటలకు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్‌ విడుదల చేయబోతున్నట్లు వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ ట్వీట్‌ చేసింది.   

 1958-1982 మద్య కాలంలో యావత్ దేశాన్ని కుదిపేసిన మట్కా జూదం నేపధ్యంలో క్రైమ్, యాక్షన్ మూవీగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ సాంగ్, టీజర్‌ అన్నీ ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. 

కరుణా కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నోరా ఫతే, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, గోపీ, రూపాలక్ష్మి, విజయరామరాజు, జగదీష్, రాజ్ తిరన్‌దాస్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: కరుణ కుమార్, పాటలు: భాస్కరభట్ల రవి కుమార్, లక్ష్మి భూపాల; సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్; కొరియోగ్రఫీ: జానీ మాస్టర్‌, సతీష్ కృష్ణన్, విజయ్‌ పోలాకి, విజయ్‌ సాగర్; కెమెరా: ఏ కిషోర్ కుమార్; జానా; స్టంట్స్‌: విజయ్‌ మాస్టర్, రామ్ సుంకర, నిఖిల్; ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్ చేస్తున్నారు. 

వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్,ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై డాక్టర్ తీగల విజయేందర్ రెడ్డి, రజని తాళ్ళూరి ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.