సత్యదేవ్, కన్నడ నటుడు డాలీ ధనంజయ ప్రధాన పాత్రలలో ‘జీబ్రా’ ఈ నెల 31న విడుదల కావలసి ఉండగా నవంబర్ 22కి వాయిదా పడింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమవడంతో సినిమాని వాయిదా వేయక తప్పలేదని నిర్మాతలు ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మ చెప్పారు. ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మజా ఫిలిమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై పాన్ ఇండియా మూవీగా దీనిని 5 భాషల్లో నిర్మిస్తున్నారు.
ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో క్రైమ్, యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న జీబ్రాకు ‘లక్ ఫేవర్స్ ది బ్రేవ్’ (ధైర్యవంతులనే అదృష్టం వరిస్తుంది) అనే ట్యాగ్ లైన్ పెట్టారు.
ఈ సినిమాలో సునీల్, సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్, సత్య, జెనిఫర్, సత్య ఆకెళ్ళ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: ఈశ్వర్ కార్తీక్, డైయాల్గ్స్: మీరక్, సంగీతం: రవి బస్రూర్, కెమెరా: సత్యా పొన్మార్, కొరియోగ్రఫీ: బాబా బాస్కర్, ఆర్కే, స్టంట్స్: రాబిన్హుడ్ సుబ్బు, ఎడిటింగ్: అనిల్ క్రిష్ చేస్తున్నారు.