
శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన భారతీయుడు-2 బోర్లా పడటం, అందరి దృష్టి రామ్ చరణ్‌తో చేస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాపైనే ఉంది. నిన్న దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల చేస్తారని అభిమానులు ఆతృతగా ఎదురుచూశారు.
టీజర్ విడుదల చేయలేదు కానీ 9న టీజర్, జనవరి 10న గేమ్ ఛేంజర్ సినిమా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయం తెలియజేస్తూ దీపావళి కానుకగా ఓ పోస్టర్ విడుదల చేశారు. ఇది అభిమానులను చాలా ఆకట్టుకుంటోంది.
గేమ్ ఛేంజర్‌లో రామ్ చరణ్‌కి జోడీగా కియరా అద్వానీ, అంజలి నటిస్తుండగా, ఎస్‌జె.సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్, జయరాం తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు స్టోరీ లైన్: కార్తీక్ సుబ్బరాజు, కధ: ఎస్.యు వెంకటేశన్, ఫర్హాద్ సంజీ, వివేక్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్ర, దర్శకత్వం: శంకర్, సంగీతం: థమన్, కెమెరా: ఎస్.తిరునవుక్కరసు, పాటలు: రామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్, యాక్షన్: ఆన్భైరవ్, కొరియోగ్రఫీ: ప్రభుదేవా, ప్రేమ్ రక్షిత్, గణేశ్ ఆచార్య, బోస్కో మార్షియా, జానీ, శాండీ, ఆర్ట్: అవినాష్ కొల్ల చేస్తున్నారు.
శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీశ్ కలిసి గేమ్ ఛేంజర్ సినిమా నిర్మిస్తున్నారు. జనవరి 10వ తేదీన గేమ్ ఛేంజర్ విడుదల కాబోతోంది.
Light it up 😎💥 #GameChangerTeaser from November 9th. Wishing everyone a very Happy Diwali 🔥#GameChanger takes charge in the theatres on JAN 10th ❤️🔥#GamechangerOnJAN10 🚁
— Sri Venkateswara Creations (@SVC_official) October 31, 2024
Global Star @AlwaysRamCharan @shankarshanmugh @advani_kiara @iam_SJSuryah @MusicThaman… pic.twitter.com/dbDr2HLWeQ