దీపావళికి మరో దివ్యమైన కానుక జై హనుమాన్

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘జై హనుమాన్’ సినిమా షూటింగ్‌ త్వరలో ప్రారంభం కాబోతోంది. దీపావళి కానుకగా నిన్న జై హనుమాన్ పోస్టర్‌ విడుదల చేయగా నేడు ‘థీమ్ సాంగ్‌’ కూడా విడుదల చేసి అభిమానులకు దివ్యమైన బహుమతి అందించారు. 

నిన్న విడుదల చేసిన పోస్టర్‌లో కన్నడ నటుడు రిషబ్ శెట్టి హనుమంతుడిగా అద్భుతంగా ఉన్నారనుకుంటే, నేడు దాంతో కలిసి విడుదల చేసిన థీమ్ సాంగ్‌ ఇంకా అద్భుతంగా ఉంది.  

జై హనుమాన్ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వైసీపి రవిశంకర్ కలిసి నిర్మిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ మొదలు పెడతామని ప్రశాంత్ వర్మ చెప్పారు.