
టాలీవుడ్ లో సూపర్ ఫాంలో ఉన్న ఒకే ఒక్క హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ఇప్పుడు ఓ సీనియర్ హీరోయిన్ షాక్ ఇచ్చింది. సూపర్ క్రేజ్ లో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ కే ఝలక్ ఇచ్చింది ఎవరబ్బా అంటే ఇంకెవరు అందాల తార త్రిష అని తెలుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ.ఎం.రత్నం కలిసి చేస్తున్న నేసన్ మూవీలో ముందు రకుల్ ప్రీత్ సింగ్ ను హీరోయిన్ గా అనుకున్నారు. అయితే ఏమైందో ఏమో కాని ఆ సినిమా నుండి రకుల్ ను తీసేసి త్రిషను సెలెక్ట్ చేశారట.
దాదాపు దశాబ్ధ కాలానికి పైగానే క్రేజీ హీరోయిన్ గా టాప్ పొజిషన్ లో కూడా ఓ వెలుగు వెలిగిన త్రిష మధ్యలో కాస్త వెనుకపడ్డట్టు కనిపించినా మళ్లీ కెరియర్ ఊపందుకుంది. ప్రస్తుతం మోహిని అని హర్రర్ సినిమాలో చేస్తున్న అమ్మడు రీసెంట్ గా వచ్చిన తమిళ కోడి (తెలుగులో ధర్మ యోగి)తో కూడా హిట్ అందుకుంది. అయితే పవన్ తో తీన్మార్ లో రొమాన్స్ చేసిన త్రిష మరోసారి ఈ లక్కీ ఛాన్స్ కొట్టేసింది. తీన్మార్ సినిమా సక్సెస్ అవలేదు కాని పవన్ త్రిష పెయిర్ బాగుందనిపించింది. మరోసారి కలుస్తున్న ఈ క్రేజీ పెయిర్ ఎలాంటి సినిమాతో వస్తున్నారో చూడాలి.