ధర్మరాజు ఎం.ఏ కాదు ఎం.బి.బి.ఎస్..!

పిజ్జా సినిమాతో తెలుగులో హిట్ అందుకున్న తమిళ హీరో విజయ్ సేతుపతి హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా వస్తున్న సినిమా ధర్మరాజు ఎం.బి.బి.ఎస్. తెలుగులో ధర్మరాజు ఎం.ఏ టైటిల్ తో కలక్షన్స్ కింగ్ మోహన్ బాబు ఓ సినిమా తీశాడు. ఇక శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ అని మెగాస్టార్ అదరగొట్టాడు. ఇప్పుడు ఆ రెండు టైటిల్స్ ను కలిపి ధర్మ రాజు ఎం.బి.బి.ఎస్ గా వస్తున్నాడు విజయ్. 

తమన్నా మార్కెట్ దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ కోలీవుడ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా హిట్ సాధించింది. అయితే తమిళ సినిమా ప్రమోషన్స్ లో తమన్నా పాల్గొనలేదని చిత్రయూనిట్ ఆమెపై విమర్శలు చేసింది. అదే తమన్నా క్రేజ్ తోనే తెలుగులో సినిమా వస్తుంది. మరి ఇక్కడైనా తమన్నాని ఒప్పించి ప్రమోషన్స్ లో పాల్గొనేలా చేస్తే కాస్తా కూస్తో బెటర్ గా ఉంటుంది. 

బహుబలి తర్వాత తమన్నా క్రేజ్ కూడా పెరిగింది. బాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయంటే తమన్నా రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో బిజీగా ఉన్న తమ్మూ బీ టౌన్ లో కూడా అదే తరహా ఫాం కొనసాగించాలని చూస్తుంది.