
శ్రీవిష్ణు తాజా చిత్రం స్వాగ్ అక్టోబర్ 4న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. సినిమా విడుదలై పూర్తిగా నెలరోజులు కూడా కాక ముందే నేటి నుంచే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది.
ఈ సినిమాలో శ్రీవిష్ణు అలఓకగా 5 పాత్రలు చేసి ప్రేక్షకులను తన నటనతో మెప్పించారు. రీతూ వర్మ హీరోయిన్‌గా నటించగా మీరా జాస్మిన్, దక్షా నాగార్కర్, సునీల్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
కధ ఏమిటంటే, పోలీస్ ఆఫీసర్‌గా చేస్తున్న భవభూతి (శ్రీవిష్ణు)తో మనస్పర్ధల కారణంగా భార్య రేవతి (మీరా జాస్మిన్) విడిపోతుంది. కొంతకాలానికి తాను భవభూతికి శ్వాగణిక వంశానికి చెందినవాడినని, తమకు వేలకోట్ల ఆస్తులున్నాయని తెలుస్తుంది. వారితో పాటు సింగా (శ్రీవిష్ణు), అనుభూతి (రీతూవర్మ) తాము కూడా వారసులమని తెలుసుకుంటారు. వారందరూ తమ వారసత్వం నిరూపించుకొనేందుకు వంశ వృక్ష నిలయానికి చేరుకుంటారు. ఆ తర్వాత ఏమి జరిగిందనేదే ఈ సినిమా కధ.
దర్శకుడు హాసిత్ గోలీ విభిన్నమైన కధాంశంతో ఈ సినిమాని తెరకెక్కించినప్పటికీ, ఈ కధని ప్రేక్షకులకు అర్దమయ్యేలా చెప్పడంలో విఫలమవడంతో సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. కానీ సినిమా కాన్సెప్ట్, నటీనటుల నటన, కామెడీ, కాస్త అశ్లీల సంభాషణల కారణంగా స్వాగ్ ప్రేక్షకులను కాస్త రంజింపజేసింది. అవునో కాదో అమెజాన్ ప్రైమ్‌లో చూసి ఓటీటీ ప్రేక్షకులు కూడా చెప్పేస్తే శ్వాగణిక వంశ చరిత్ర ఇక్కడితో ముగుస్తుంది.