టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంచల్‌గూడా జైలులో ఉన్న ఆయన ఈరోజు సాయంత్రంలోగా విడుదలై బయటకు వఛ్చే అవకాశం ఉంది.
తన బృందంలో సహాయ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న ముంబాయికి చెందిన ఓ యువతిపై లైంగిక వేధింపులు, అత్యాచారానికి పాల్పడినందుకు నార్సింగి పోలీసులు గత నెల 16న జానీ మాస్టర్‌పై సెక్షన్స్ 376, 506, 323 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం ఆయనకు రెండు వారాలు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది.
జానీ మాస్టర్‌కి ఉత్తమ కొరియోగ్రాఫర్ జాతీయ అవార్డుకి ఎంపికవగా ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు ఆయనకు అక్టోబర్ 6 నుంచి 9వరకు మద్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ ఆయన ఈ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నట్లు తెలుసుకున్న జాతీయ అవార్డుల కమిటీ ఆయనకు పంపిన ఆహ్వానాన్ని రద్దు చేసింది.
కనుక జానీ మాస్టర్ తృటిలో జాతీయ అవార్డుని చేజార్చుకొని చంచల్‌గూడా జైలుకి తిరిగి వచ్చారు. తీవ్రమైన ఈ ఆరోపణలు, పోలీస్, కోర్టు కేసుల కారణంగా ఇప్పుడు ఆయనకు సినీ పరిశ్రమలో మళ్ళీ అవకాశాలు లభిస్తాయో లేదో తెలీదు.
కానీ, ఎంతో శ్రమించి సినీ పరిశ్రమలో ఓ స్థాయికి ఎదిగి, జాతీయ అవార్డు కూడా సాధించి, ఇంత త్వరగా అధః పాతాళానికి పడిపోవడం సినీ పరిశ్రమలో అందరికీ ఓ గుణపాఠం వంటిదే.