ఆ రెండు నిర్మాణ సంస్థల అహంభావం ఎక్కువట!

బాలీవుడ్‌లో అతిపెద్ద సినీ నిర్మాణ సంస్థలలో యష్ రాజ్‌ ఫిలిమ్స్, ధర్మ ప్రొడక్షన్స్ కూడా ఒకటి. ఆ రెండు సంస్థలు భారీ బడ్జెట్‌తో బాలీవుడ్‌ అగ్రనటీనటులతో అనేక సూపర్ హిట్ సినిమాలు నిర్మిస్తూ దూసుకుపోతున్నాయి. అయితే ఆ అహంభావంతోనే అవి తీసే సినిమాలలో నటించే నటీనటులకు చాలా తక్కువ పారితోషికం ఇస్తుంటాయని బాలీవుడ్‌ నటుడు విక్రమ్ కపాడియా సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. అయితే ఆ రెండు సంస్థలు చిన్న నటీనటులతోనే కాక పెద్ద నటీనటులతో కూడా ఆవిదంగానే వ్యవహరిస్తుంటాయని విక్రమ్ కపాడియా ఆరోపించారు. 

ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో “గతంలో నటీనటులు డిమాండ్ చేసినంత భారీ పారితోషికాలు మేము ఇచ్చాము. కానీ ఇకపై మా సినిమా బడ్జెట్‌ని బట్టి ఎంత ఇవ్వగలమో అంతే ఇస్తాము. అందుకు ఇష్టపడిన వారితోనే మేము సినిమాలు తీస్తాము,” అని చెప్పారు. 

కరణ్ జోహార్ చెప్పిన ఈ మాటలపై స్పందిస్తూ విక్రమ్ కపాడియా ఈ రెండు సినీ నిర్మాణ సంస్థలపై చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.