కాస్త ఆలస్యంగా రాజాసాబ్ వచ్చేశారు కానీ...

ఈరోజు ప్రభాస్‌ పుట్టినరోజు కానుకగా ‘ది రాజాసాబ్’ సినిమా మోషన్ పోస్టర్‌ విడుదలైంది. ఇది హర్రర్, రొమాంటిక్ కామెడీ సినిమా అని మొదటి నుంచే మారుతి చెపుతున్నారు కనుక మోషన్ పోస్టర్‌లో అభిమానులు జీర్ణించుకోలేని విదంగా రాజాసాబ్‌ని చూపి షాక్ ఇచ్చారు. 

ఓ పాడుబడిన భవనంలో ఒంటరిగా ఓ కుర్చీలో కూర్చొని సిగార్ కాల్చుతున్నట్లు ప్రభాస్‌ని చూపారు. పుట్టినరోజునాడు ప్రభాస్‌ని రొమాంటిక్ లేదా చిలిపిగా చూపిస్తారనుకుంటే ఈ రూపంలో చూపించడంతో అభిమానులు ఏవిదంగా స్పందిస్తారో తెలీదు కానీ సగటు ప్రేక్షకుడు మాత్రం ప్రభాస్‌ వంటి అందగాడిని ఈవిదంగా పరిచయం చేయడం జీర్ణించుకోవడం కష్టమే. 

రాజాసాబ్‌కి జోడీగా మాళవిక మోహనన్ నటిస్తోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకి సంగీతం: ఎస్ఎస్ తమన్, కెమెరా: కార్తీక్ పళని, ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేస్తున్నారు. 

 పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో దీనిని నిర్మిస్తున్నారు. రాజాసాబ్‌ వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.