
జూ.ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా వచ్చిన దేవర మొదటి భాగంలో ఆయుధపూజ పాట చాలా ప్రత్యకేమైనది. ఆ పాటకి సంగీతం, ముఖ్యంగా జూ.ఎన్టీఆర్ బృందం చేసిన డ్యాన్స్ అభిమానులనే కాదు సినీ ప్రేమికులను కూడా మైమరపించింది.
ఇప్పుడు ఆ పాటని యూట్యూబ్లో విడుదల చేయగా వైరల్ అవుతోంది. సినిమాకి ముందు పాటని విడుదల చేసి అది అద్భుతంగా ఉంటే వైరల్ అవడం సహజం. కానీ సినిమా విడుదలైన దాదాపు నెలరోజుల తర్వాత కూడా ఓ పాట వైరల్ అవడం విశేషమే కదా?
సెప్టెంబర్ 27న దేవర రిలీజ్ అయినప్పుడు కొందరు పెదవి విరిచారు. మరికొందరు పర్వాలేదన్నారు. గొప్పగా ఉందని చెప్పినవారు తక్కువే కానీ సినిమా సూపర్ హిట్ అయ్యింది. సుమారు రూ.600 కోట్లుపైగా కలక్షన్స్ రాబట్టి జూ.ఎన్టీఆర్ కెరీర్లో ఓ రికార్డుగా నిలిచిపోయింది.
ప్రస్తుతం జూ.ఎన్టీఆర్ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్తో కలిసి వార్-2 పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. అది పూర్తిచేసిన తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం సినిమా చేయబోతున్నారు. దానికి ‘డ్రాగన్’ అని పేరు ఖరారు చేసిన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు పూర్తిచేసిన తర్వాత దేవర-2 మొదలుపెట్టే అవకాశం ఉంది.