నాగ చైతన్య-శోభిత ధూళిపాళలకు ఆగస్ట్ 8న వివాహ నిశ్చితార్ధం అయ్యింది కానీ వారి వివాహం ఎప్పుడు జరుగుతుందో ఇంకా ప్రకటించలేదు. పెళ్ళి సన్నాహాలకు ప్రారంభించే ముందు ఆనవాయితీ ప్రకారం గోధుమ రాయి, పసుపు దంచే కార్యక్రమం జరిగిందని శోభిత ధూళిపాళ స్వయంగా తమ అభిమానులకు తెలియజేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఫోటోలను కూడా షేర్ చేశారు. కనుక అతి త్వరలోనే నాగ చైతన్య-శోభిత ధూళిపాళ వివాహ తేదీని ప్రకటించే అవకాశం ఉంది.
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పూర్తికాగానే నాగ చైతన్య-శోభిత ధూళిపాళ పెళ్ళి జరుగవచ్చు.
నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత చేసిన యశోద, శాకుంతలం, ఖుషీ మూడు సినిమాలు నిరాశపరిచాయి. మయొసైటీస్ వ్యాధి కారణంగా ఆమె ఆరోగ్యం కూడా పాడైంది. అయినప్పటికీ శ్రేయోభిలాషుల ప్రోత్సాహంతో కోలుకొని ‘సిటాడెల్ హనీ బన్నీ’ అనే వెబ్ సిరీస్ పూర్తి చేశారు. నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కాబోతోంది. ఇది హిట్ అయితే మళ్ళీ సమంత సినీ కెరీర్ కూడా గాడిన పడిన్నట్లవుతుంది.