బాలీవుడ్‌ యుద్ధభూమిలో జూ.ఎన్టీఆర్‌

జూ.ఎన్టీఆర్‌ తొలిసారిగా బాలీవుడ్‌ చేస్తున్న హిందీ చిత్రం వార్-2. బాలీవుడ్‌ దర్శకుడు ఆయన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్, జూ.ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రలలో ఈ యాక్షన్ సినిమా తెరకెక్కిస్తున్నారు. వారిద్దరూ మంచి డాన్సర్స్ కనుక ఇద్దరితో ఓ డాన్స్ కూడా ఉండేలా దర్శకుడు ప్లాన్ చేసి షూటింగ్‌ చేసిన్నట్లు తెలుస్తోంది. దేవర పూర్తికాగానే జూ.ఎన్టీఆర్‌ విమానం ఎక్కి ముంబయిలో వాలిపోయారు.

ప్రస్తుతం జూ.ఎన్టీఆర్‌, హృతిక్ రోషన్‌, ముఖ్య తారాగణంతో ముంబాయిలో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. 2025, ఆగస్ట్ 14వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్న ఈ సినిమాకి తెలుగులో ‘యుద్ధభూమి’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కానీ ఆ పేరు చాలా పాతపేరులా ఉన్నందున వార్-2 అనే పేరుతోనే తెలుగులో కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సినిమాలో కియరా అద్వానీ ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. మరో హీరోయిన్‌ పేరు ఇంకా ఖరారు కావలసి ఉంది. ప్రముఖ బాలీవుడ్‌ సినీ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మిస్తున్నారు.