నెట్‌ఫ్లిక్స్‌లోకి సత్యం సుందరం.... ఈ నెల్లోనే!

అరవిందస్వామి, కార్తీ ప్రధాన పాత్రలు చేసిన ‘సత్యం సుందరం’ సినిమాలో ఫైట్స్, డ్యాన్సులు వగైరా కమర్షియల్ హంగులేవీ లేవు. ఓ పల్లెటూరు నేపధ్యంలో ఇద్దరు వ్యక్తుల జీవితాలు, వారి భావోద్వేగాలు మాత్రమే సినిమాలో కనిపిస్తాయి. కధనం కూడా నత్తనడకన చాలా మెల్లగా సాగుతుంది.

కనుక చాలా మందికి ఈ సినిమా విసుగెత్తించి ఉండవచ్చు కానీ ‘మిగిలిన చాలా మందిని’ అరవిందస్వామి, కార్తీలు తమ నటనతో కుర్చీలలో నుంచి లేవకుండా సినిమా చూసేలా చేశారు. సినిమా కమర్షియల్‌గా హిట్ కాకపోయి ఉండొచ్చు కానీ సినీ విమర్శకుల ప్రశంశలు అందుకుంది.

తెలుగు, తమిళంలో సెప్టెంబర్‌ 28న విడుదలైన సత్యం సుందరం, నెలరోజులు కాక మునుపే అంటే అక్టోబర్‌ 25వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కాబోతున్నట్లు తెలుస్తోంది. 

సూర్య, జ్యోతిక దంపతుల సొంత బ్యానర్ 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌పై ఈ సినిమాను వారే నిర్మించారు. ఈ సినిమాకి పాటలు: రాకేందు మౌళి, సంగీతం: గోవింద్ వసంత, కెమెరా: మహేంద్రన్ రాజు, ఎడిటింగ్: గోవింద రాజ్, ఆర్ట్: అయ్యప్పన్ చేశారు.