పుష్ప-2లో ఐటెమ్ సాంగ్ ఆమెకే!

అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేషన్‌లో సిద్దం అవుతున్న పుష్ప-2 షూటింగ్‌ దాదాపు పూర్తయింది. ఒక ఐటెమ్ సాంగ్, హీరో హీరోయిన్ల మీద ఓ పాట చిత్రీకరిస్తే షూటింగ్‌ పూర్తయిపోతుంది. దీనిలో ఐటెమ్ సాంగ్‌ కోసం మొదట జాన్వీ కపూర్‌ లేదా శ్రీలీలని అనుకున్నా చివరికి బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ని ఖరారు చేసిన్నట్లు తెలుస్తోంది. ఈ ఐటెమ్ సాంగ్‌ చేసేందుకు ఆమె రూ.4 కోట్లు డిమాండ్ చేయగా మైత్రీ మూవీ మేకర్స్ అందుకు అంగీకరించిన్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే పుష్ప-2 ఫస్టాఫ్ ఎడిటింగ్ తదితర పనులు పూర్తయిపోయాయి. ప్రస్తుతం సెకండ్ హాఫ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కనుక నవంబర్‌లో మిగిలిన ఈ రెండు పాటల షూటింగ్‌ పూర్తి చేసి డిసెంబర్‌ 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

పుష్ప-2లో ఫహాద్ ఫాసిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, జగపతిబాబు, శ్రీతేజ్, మీమ్ గోపిలు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకి కెమెరా: మీరొస్లా కుబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. 

ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.