నేను అలా చేసి ఉండకూడదు: రాహుల్ సిప్లీగంజ్

రాహుల్ సిప్లీగంజ్... ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల అభిమాన యువనటులలో ఒకరు. అతను ఓ యూట్యూబ్‌ చానల్‌కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో, తాను రజినీకాంత్ వీరాభిమానినని, కానీ తనవల్లే ఆయన సినిమాకి కొంత నష్టం జరిగినందుకు నేటికీ బాధపడుతున్నానని చెప్పారు.

రంగమార్తాండ సినిమా షూటింగ్‌ సమయంలో ప్రకాష్ రాజ్‌ తనను వెంటబెట్టుకొని అన్నాతే షూటింగ్‌ సెట్లో ఉన్న రజినీకాంత్ వద్దకు తీసుకు వెళ్ళారని, తన అభిమాన హీరోని చూసేసరికి సంతోషంగా ఆయన కాళ్ళకు నమస్కరించానని చెప్పారు. 

అప్పుడు రజినీ సార్ స్వయంగా సెల్ఫీ తీసి ఇచ్చారని రాహుల్ సిప్లీగంజ్ చెప్పారు. ఆయన ఆ సినిమా షూటింగ్‌కి సంబందించి గెటప్‌లో సెల్ఫీ ఇస్తున్నప్పుడు సినిమా విడుదలయ్యే వరకు దానిని ఎవరికీ షేర్ చేయవద్దని చెప్పారని రాహుల్ సిప్లీగంజ్ చెప్పారు. 

కానీ పది రోజులయ్యేక నా సంతోషాన్ని నలుగురితో పంచుకోవాలనే తాపత్రయంతో ఆ ఫోటోని సోషల్ మీడియాలో పెడితే అది వైరల్ అయ్యిందని, అది చూసి అన్నాతే దర్శక నిర్మాతలు తీవ్ర ఆందోళన చెందుతూ నాకు ఫోన్‌ చేశారని రాహుల్ సిప్లీగంజ్ చెప్పారు. 

తాను వెంటనే ఆ ఫోటోని డిలీట్ చేసినప్పటికీ అప్పటికే ఆ ఫోటో వైరల్ అయిపోయిందని చెప్పారు. నేను ఎంతగానో అభిమానించే రజినీ సార్‌కి నా వల్లనే ఇటువంటి కలిగినందుకు నేటికీ నేను బాధపడుతూనే ఉన్నానాని రాహుల్ సిప్లీగంజ్ చెప్పారు.