మున్నాభాయ్-3 వస్తోందట...అయితే శంకర్ దాదా-3 కూడా?

సుమారు 20 ఏళ్ళ క్రితం బాలీవుడ్‌ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరానీ దర్శకత్వంలో సంజయ్ డాట్ హీరోగా మున్నాభాయ్ ఎంబీబీఎస్, దానికి సీక్వెల్‌గా లాగేరహో మున్నాభాయ్ వచ్చాయి. రెండూ సూపర్ హిట్ అయ్యాయి. వాటినే మెగాస్టార్ చిరంజీవి హీరోగా శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్‌గా తెలుగులో రీమేక్ చేస్తే అవి కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. 

రాజ్‌కుమార్‌ హిరానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఓ ప్రశ్నకు సమాధానంగా “ప్రస్తుతం నా వద్ద చాలా కధలున్నాయి. కానీ  సంజయ్ దత్ అభ్యర్ధన మేరకు ముందుగా మున్నాభాయ్-3 స్క్రిప్ట్ సిద్దం చేస్తున్నాను. ఇదివరకే ఇది సగం వరకు వ్రాసి మద్యలో వదిలేషాను. ఇప్పుడు ముందుగా మున్నాభాయ్-3ని పూర్తిచేయాలని నిర్ణయించుకున్నాను,” అని చెప్పారు. 

ఒకవేళ హిందీలో మున్నాభాయ్-3 స్క్రిప్ట్ రెడీ అయితే అప్పుడు చిరంజీవి దానిని కూడా తెలుగులో రీమేక్ చేయడం ఖాయమే. కానీ ఇప్పుడు పాన్ ఇండియా మూవీ ట్రెండ్ నడుస్తోంది కనుక సంజయ్ దత్ హీరోగా తెలుగులో కూడా నిర్మించే ఆలోచన చేస్తే కష్టమే. కానీ చిరంజీవి తనకు ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిన శంకర్ దాదాని వదిలేసుకుంటారని అనుకోలేము. కనుక ఏదోవిదంగా మున్నాభాయ్‌ని ఒప్పించి తెలుగు ప్రేక్షకుల కోసం మళ్ళీ శంకర్ దాదాని తీసుకురావడం ఖాయమే.