
అనన్య నాగళ్ళ, యువ చంద్ర కృష్ణ, అజయ్, ప్రియాంకా శర్మ, నోయల్ ప్రధాన పాత్రలలో పొట్టేల్ సినిమా ఈ నెల 25న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో ట్రైలర్ విడుదల చేశారు. సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో గ్రామీణ నేపధ్యంలో ఓ సామాజిక అంశం చుట్టూ అల్లుకున్న సినిమాయే ఈ పొట్టేల్.
ఈ సినిమాకు కధ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సాహిత్ మోత్కూరి; సంగీతం: శేఖర్ చంద్ర, పాటలు: కాసర్ల శ్యామ్, కొరియోగ్రఫీ: సాయి తేజ, వెంకట్, ఫైట్స్: రాబిన్హుడ్ సుబ్బు, కెమెరా: మోనిశ్ భూపతి దిల్రాజు చేశారు,
ఈ సినిమాని నిశా ఎంటర్టైన్మెంట్స్, ప్రజ్ఞ్య సన్నిధి క్రియెషన్స్, సాహిత్ మోత్కూరి రైటింగ్స్ బ్యానర్లపై నిశాంక్ రెడ్డి, సురేశ్ కుమార్ సాడిగే నిర్మించారు.