
శంకర్-రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమాకి సంబందించి ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో ఒక్కో పాటకి దర్శకుడు శంకర్ రూ.20 కోట్లు ఖర్చు పెట్టించాడట. ఇప్పటి వరకు జరగండి జరగండి... రా మచ్చా మచ్చా అనే రెండు పాటలు విడుదలయ్యాయి.
రెండూ కూడా ఆశించినదాని కంటే చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. పాటలు కూడా చాలా క్యాచీగా ఉండటంతో వైరల్ అవుతున్నాయి. రెండు పాటలకు అభిమానుల నుండి మంచి స్పందన వస్తోంది.
ఇప్పుడు రామ్ చరణ్, కియరా అద్వానీలపై మరో రొమాంటిక్ మెలోడీ సాంగ్ షూట్ చేయబోతున్నారట దానికీ మరో రూ.20 కోట్లు ఖర్చు అయిన్నట్లు తెలుస్తోంది.
మొత్తం మీద సినిమాలో నాలుగు పాటలకే శంకర్ రూ.80కోట్లు ఖర్చు పెట్టించేయడం చూస్తున్న చిన్న నిర్మాతలు ఆ బడ్జెట్‌తో తాము రెండు మూడు సినిమాలు చేసుకోగలమని చెపుతున్నారు.
గేమ్ ఛేంజర్‌లో అంజలి, ఎస్‌జె.సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్, జయరాం తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు స్టోరీ లైన్: కార్తీక్ సుబ్బరాజు, కధ: ఎస్.యు వెంకటేశన్, ఫర్హాద్ సంజీ, వివేక్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్ర, దర్శకత్వం: శంకర్, సంగీతం: థమన్, కెమెరా: ఎస్.తిరునవుక్కరసు, పాటలు: రామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్, యాక్షన్: ఆన్భైరవ్, కొరియోగ్రఫీ: ప్రభుదేవా, ప్రేమ్ రక్షిత్, గణేశ్ ఆచార్య, బోస్కో మార్షియా, జానీ, శాండీ, ఆర్ట్: అవినాష్ కొల్ల చేస్తున్నారు.
శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీశ్ కలిసి గేమ్ ఛేంజర్ సినిమా నిర్మిస్తున్నారు. గేమ్ ఛేంజర్ ఈ ఏడాది డిసెంబర్ 20న విడుదల కావలసి ఉన్నప్పటికీ జనవరికి వాయిదా పడింది. సంక్రాంతి పండుగ ముందు విడుదల చేయబోతున్నట్లు దిల్‌రాజు చెప్పారు.