
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం విడి12 వర్కింగ్ టైటిల్‌తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించామని విజయ్ దేవరకొండ స్వయంగా చెప్పారు.
ప్రకృతి అందాలకు నిలయమైన కేరళ అంటే తనకు చాలా ఇష్టమని, ఇక్కడ షూటింగ్ జరుగుతుండటంతో తాను చాలా ఆనందిస్తున్నానని చెప్పారు. ఈ సినిమా నా అబిమానులు అందరికీ నచ్చే విదంగా ఉంటుంది,” అని చెప్పారు.
ఇప్పటి వరకు 60 శాతం సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాని ఫస్ట్-లుక్ పోస్టర్‌లోనే 2025, మార్చి 28న విడుదల చేయబోతున్నట్లు సితార ఎంటర్‌టైన్‌మెంట్ ప్రకటించింది.
టైటిల్ పోస్టర్‌లో “అతని విధి అతని కోసం వేచి ఉంది. తప్పులు.. రక్తపాతం.. ప్రశ్నలు.. పునర్జన్మ..” అంటూ ఈ సినిమా పునర్జన్మ కధతో ఈ సినిమా తీయబోతున్నట్లు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చిన్న హింట్ ఇచ్చారు..
ఈ సినిమాకు సంగీతం: అనిరుధ్ రవిచందర్, కెమెరా: గిరీష్ గంగాధరన్ చేస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు.