పుష్ప-2 ముగింపులో పుష్ప-3 బిట్ చూపిస్తారట!

అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేషన్‌లో పుష్ప-2 షూటింగ్‌ దాదాపు పూర్తయింది. ఓ ఐటెమ్ సాంగ్‌, హీరో హీరోయిన్లపై మరో పాట షూటింగ్‌ బాకీ ఉంది. నవంబర్‌ మూడో వారంలోగా రెండు పాటల షూటింగ్‌ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఐటెమ్ సాంగ్‌ కోసం దీప్తి తిమ్రీ, శ్రద్దా కపూర్, జాన్వీ కపూర్‌ ముగ్గురులో ఎవరో ఒకరు చేయవచ్చని తెలుస్తోంది. 

ఇక పుష్ప-2కి కొనసాగింపుగా పుష్ప-3 కూడా చేయబోతున్నట్లు అల్లు అర్జున్‌, సుకుమార్ ఇద్దరూ ఇదివరకే చెప్పేశారు. కనుక పుష్ప-2 ముగింపు సన్నివేశంలో పుష్ప-3కి సంబందించిన ఓ సన్నివేశాన్ని చూపించబోతున్నారు. అయితే అల్లు అర్జున్‌, సుకుమార్ ఇద్దరూ వేరే సినిమాలు చేయాల్సి ఉన్నందున పుష్ప-3 షూటింగ్‌ వెంటనే మొదలుపెట్టలేరు. బహుశః 2026లో మొదలయ్యే అవకాశం ఉంది. పుష్ప-2 ఈ ఏడాది డిసెంబర్‌ 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.