పవన్‌ కళ్యాణ్‌ త్వరలో ఓజీ షూటింగ్‌కి

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌గా మారడంతో చేస్తున్న సినిమాలు పక్కన పెట్టి అధికారిక బాధ్యతల నిర్వహించక తప్పడం లేదు. ఆ కారణంగా హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ మూడు సినిమాలు సగంలో నిలిచిపోయాయి. 

ఇటీవల పవన్‌ కళ్యాణ్‌ వీలు చేసుకొని విజయవాడలో వేసిన ప్రత్యేక సెట్స్‌లో ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. త్వరలోనే అది పూర్తి కాగానే తర్వాత సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ’ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌, రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. పవన్‌ కళ్యాణ్‌ లేని సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు.   

ఈ రెండు సినిమాలపై స్పష్టత వచ్చింది కానీ హరీష్ శంకర్‌ దర్శకత్వంలో మొదలుపెట్టిన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’ సినిమా ఇంకా ఎప్పుడు మొదలు పెడతారో తెలీదు. 

ఓజీ సినిమా పూర్తి చేయబోతున్నారు కనుక 2025లో పవన్‌ కళ్యాణ్‌ నటించిన రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. వాటిలో హరిహర వీరమల్లు వచ్చే ఏడాది మార్చి 28వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఇదివరకే ప్రకటించారు. కనుక ‘ఓజీ’ వచ్చే ఏడాది ఇదే సమయానికి దసరా, దీపావళి పండుగ సీజన్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. కానీ ఉస్తాద్ భగత్ సింగ్‌ షూటింగ్‌ ఎప్పుడు మొదలుపెట్టి ఎప్పటికీ పూర్తి చేస్తారో?