
టాలీవుడ్ సూపర్ డైరక్టర్ పూరి జగన్నాథ్ ఇజం ఫ్లాప్ తర్వాత తీర్వమైన ఒత్తిడిలో పడ్డాడు. వరుసగా మూడు ఫ్లాపులు మూటకట్టుకున్న పూరి ఈసారి కుర్ర హీరోలతో సినిమా చేస్తాడని నిన్న మొన్నటి రూమర్. అంతేకాదు బ్యాంకాక్ వెళ్లి కథ కూడా సిద్ధం చేస్తున్నాడని అన్నారు. కాని లేటెస్ట్ గా పూరి ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ ప్లానింగ్ లో ఉన్నాడట. అది కూడా అలాంటిలాంటి లేడితో కాదు క్వీన్ గా బాలీవుడ్ లో కాసుల వర్షం కురిపించి నేషనల్ అవార్డ్ కైవసం చేసుకున్న కంగనా రనౌత్ లాంటి హీరోయిన్ తో ఫీమేల్ లీడ్ సినిమా చేస్తాడట.
ఏంటి ఇది నిజమేనా అంటే.. అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు.. ఆల్రెడీ ఏక్ నిరంజన్ లో కంగనాతో వర్క్ చేశాడు పూరి. అయితే ఆ సినిమాలో అమ్మడిని సరిగా వాడుకోలేదని ఫీల్ అయ్యాడు కూడా.. అందుకే ఈసారి లేడీ ఓరియెంటెడ్ మూవీతో రాబోతున్నాడట. ఇప్పటికే లాస్ట్ ఇయర్ జ్యోతిలక్ష్మిగా చార్మితో ఇలాంటి ప్రయత్నమే చేసినా లాభం లేకుండా పోయింది మరి అలాంటిది ఈ కొత్త ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
ఓ విధంగా పూరి చాలా డేరింగ్ డెశిషన్ తీసుకున్నాడని అనాల్సిందే. స్టార్స్ ఎవరు తనకు ఛాన్స్ ఇవ్వకపోబట్టే పూరి ఇలాంటి స్టెప్ వేస్తున్నాడు. మరి కంగనా లాంటి కత్తి లాంటి ఆర్టిస్ట్ చేతిలో పడ్డాక పూరి ఆమెను ఏ రేంజ్ లో చూపించి హిట్ సాధిస్తాడో చూడాలి.