సిటాడెల్ నేను చేయలేనని చెప్పా: సమంత

ప్రముఖ సినీ నటి సమంత మయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆ కారణంగా తాను సిటాడెల్ హనీ బన్నీ వెబ్‌ సిరీస్‌ చేయలేనని, తనకు బదులు వేరే హీరోయిన్‌ని తీసుకోవాలని నలుగురు హీరోయిన్ల పేర్లు సూచించానని చెప్పారు. కానీ దర్శకులు రాజ్‌ అండ్ డీకేలు ఈ పాత్ర నేనే చేయాలని పట్టుబట్టి ఒప్పించారని సమంత చెప్పారు.

తన అనారోగ్యం కారణంగా యాక్షన్ సన్నివేశాలు చేయలేననే అనుకున్నానని కానీ అందరి సహకారంతో ఈ వెబ్‌ సిరీస్‌ చేయగలిగానని చెప్పారు.

తాను సినీ పరిశ్రమలో ప్రవేశించి ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా శ్రమించానని, కానీ తనకు సినీ పరిశ్రమలో చాలా మంది సహాయసహకారాలు అందిస్తూ, అడుగడుగునా తోడ్పడుతూనే ఉన్నారని సమంత అన్నారు. వారందరి సహాయసహకారాలు లేకపోతే తాను ఎన్నటికీ ఈ స్థాయికి చెరగలిగేదానిని కాదన్నారు.

ఈ వెబ్‌ సిరీస్‌ చేయడంలో రాజ్‌ అండ్ డీకేలతో పాటు తన జిమ్ ట్రైనర్ మొదలు ప్రతీ ఒక్కరూ నాకు ఎంతగానో తోడ్పడ్డారని, వారందరికీ పేరుపేరునా సమంత కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.

సెలబ్రేటీలకు ప్రశంశలతో పాటు విమర్శలు, అవహేళనలు కూడా లభిస్తుంటాయని, ప్రశంశలు చాలా సంతోషం కలిగించడం సహజమే అని కానీ సద్విమర్శలను స్వీకరించి, మిగిలినవాటిని పట్టించుకోనని  సమంత చెప్పారు. 

నవంబర్‌ 7వ తేదీ నుంచి సిటాడెల్ హనీ బన్నీ అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కాబోతోంది. ఈ వెబ్‌ సిరీస్‌లో 11 నిమిషాల పాటు సాగే క్లైమాక్స్ సన్నివేశాన్ని సింగిల్ టేక్‌లో పూర్తి చేశానని ఇది వెబ్‌ సిరీస్‌కి హైలైట్‌గా నిలుస్తుందని సమంత చెప్పారు.