
ఏమాయ చేసావేలో కలిసి నటించి అప్పటి నుండి మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ వచ్చిన నాగ చైతన్య సమంత ఇప్పుడు వారి ప్రేమకు పెద్దల అంగీకారం రావడంతో పెళ్లికి సిద్ధమైపోయారు. అయితే ముందుగా అఖిల్ పెళ్లి ఆ తర్వాతనే తన పెళ్లి అని చెప్పుకొస్తున్న చైతు తన పెళ్లికి సంబందించిన విషయాల పట్ల కూడా ఆలోచన చేస్తున్నాడట. తెలుస్తున్న సమాచారం ప్రకారం చైతు, సమంతల పెళ్లి వచ్చే ఏడాది ఆగష్టులో ఉండొచ్చని అంటున్నారు.
హిందూ, క్రిస్టియన్ రెడు సాంప్రదాయాలలో ఈ పెళ్లి జరుగుతుందట. ముందు హిందు సాంప్రదాయం ప్రకారం జరిపి ఆ తర్వాత చెన్నైలో ఓ చర్చ్ లో మరోసారి చైతు, సమంతల మ్యారేజ్ జరుగనున్నదట. సో వారి పెళ్లి ఎప్పుడు ఎప్పుడు అని ఎదురుచూసిన ఫ్యాన్స్ కు ఇదో గుడ్ న్యూస్ అన్నట్టే. అఖిల్ మ్యారేజ్ కు తన మ్యారేజ్ కు కనీసం ఓ ఆరు నెలలు గ్యాప్ వచ్చేలా చేసుకున్న చైతు చూస్తుంటే తన మ్యారేజ్ కూడా అట్టహాసంగానే చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నాగార్జున అఖిల్, శ్రీయ భూపాల్ ల ఎంగేజ్మెంట్ కార్డ్స్ తో ప్రముఖులను ఇన్వైట్ చేయడంలో బిజీగా ఉన్నాడు.