
దర్శకుడు బోయపాటి, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో 2021లో సంక్రాంతికి విడుదలైన ‘అఖండ’ సూపర్ హిట్ అయ్యింది. కనుక మళ్ళీ వారిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే భారీ అంచనాలే ఉంటాయి. మొన్న దసరా పండుగనాడు వారి కొత్త సినిమాకి పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమా పేరు ‘అఖండ 2-తాండవం’ అని ప్రకటించారు. అంటే ఇది అఖండకి సీక్వెల్ అన్న మాట! అఖండ 2-తాండవం టైటిల్ పోస్టర్ కూడా చాలా అద్భుతంగా ఉంది.
ఈ సినిమాని బాలకృష్ణ కుమార్తె తేజస్విని సమర్పణలో 14 రీల్స్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట కలిసి నిర్మిస్తున్నారు. కోటి పరుచూరి సహ నిర్మాత. అఖండ హిందీలో డబ్ చేసి విడుదల చేస్తే ఉత్తరాది రాష్ట్రాలలో కూడా సూపర్ హిట్ అయ్యింది. కనుక ఈసారి అఖండ 2-తాండవం సినిమాని పాన్ ఇండియా మూవీగా నిర్మించాలని నిర్ణయించారు. కనుక బోయపాటికి, బాలకృష్ణకు ఇద్దరికీ ఇదే తొలి పాన్ ఇండియా సినిమా కాబోతోంది. ఈ సినిమాకి తమన్ సంగీతం అందించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.