సంబంధిత వార్తలు

దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా లక్కీ భాస్కర్ సినిమా ఈ నెల 31న విడుదల కాబోతోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఒక్కో పాటని రిలీజ్ చేస్తున్నారు. తాజాగా శ్రీమతిగారు అంటూ సాగే పాటని విడుదల చేశారు. శ్రీమని వ్రాసిన ఈ పాటని జీవీ ప్రకాష్ కుమార్ స్వరపరచగా విశాల్ మిశ్రా, శ్వేత మోహన్ మృధుమధురంగా పాడారు.
శ్రీకర్ స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకి సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, కెమెరా: నిమిషి రవి, ఆర్ట్: బంగాళన్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.