
మంగళవారం సాయి దుర్గ తేజ్ పుట్టినరోజు సందర్భంగా తన 18వ సినిమాని ప్రారంభించారు. ఎస్డీటీ18 వర్కింగ్ టైటిల్‌తో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఈ సినిమాని కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు.
ఈ సినిమాతో కేపీ రోహిత్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ప్రారంభించి తొలి షెడ్యూల్లో 15 రోజులపాటు కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. నిన్నసాయి దుర్గ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా మేకింగ్ వీడియో విడుదల చేశారు.
గత ఏడాది సాయి దుర్గ తేజ్ విరూపాక్ష, బ్రో సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు, తర్వాత చేస్తున్న సినిమా ఇదే కనుక మరో విభిన్నమైన కధాంశంతో ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో వసంత హీరోయింగ్ గా నటించబోతోంది. మిగిలిన నటీ నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు త్వరలో ప్రకటిస్తారు.