
‘బలగం’… ఒకే ఒక సినిమాతో వేణు ఎల్దండి పేరు మారుమ్రోగిపోయింది. సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. బలగం తర్వాత వేణు ఎల్దండి మరో సినిమా చేయలేదు కానీ ఆ మరో సినిమా బలగం కంటే గొప్పగా ఉండాలని మంచి కధ సిద్దం చేసుకున్నారు. ఈసారి కూడా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా తెలంగాణ నేపధ్యంతో ఓ కధ సిద్దం చేసుకున్నారు. ఆ సినిమాకి ‘ఎల్లమ్మ’ అనే పేరు కూడా రిజిస్టర్ చేసుకున్నట్లు సమాచారం.
అయితే ఈ కధకు కాస్త పాపులర్ అయిన యువహీరో అవసరం కనుక మొదట నానిని కలిస్తే ఆయన సై అన్నారు కానీ ఇతర కమిట్మెంట్స్ వలన అది చేయలేకపోయారు. ఆ తర్వాత శర్వానంద్‌కి కధ చెపితే ఆయనకి బాగా నచ్చింది కానీ డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయిన్నట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి యువ హీరో నితిన్ ఒకే చెప్పిన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నితిన్ ‘తమ్ముడు’, ‘రాబిన్‌హుడ్’ రెండు సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. అవి పూర్తికాగానే వేణు ఎల్దండితో ఎల్లమ్మ సినిమా చేసేందుకు అంగీకరించిన్నట్లు తెలుస్తోంది. మరి అది ఎప్పుడు మొదలవుతుందో వారికే తెలియాలి. ఒకవేళ నితిన్ కూడా ఈ సినిమా చేయలేకపోతే వేణు ఎల్దండి మరో హీరోని చూసుకోక తప్పదు.