కలక్షన్స్‌లో దేవర మరో సరికొత్త రికార్డ్

కొరటాల శివ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ జంటగా చేసిన ‘దేవర’ సినిమా విడుదలకు ముందే టికెట్స్ బుకింగ్స్ లో రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు మరో రికార్డ్ సృష్టించింది. సినిమా విడుదలైన మొదటి 18 రోజులలో రెండు తెలుగు రాష్ట్రాలలో రోజుకి కోటి రూపాయలు చొప్పున కలక్షన్స్‌ సాధించింది.

 సీడెడ్ ఏరియాలో ఏకంగా రూ.30 కోట్లు కలక్షన్స్‌ సాధించి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రికార్డులను బద్దలు కొట్టింది. దేవర సెప్టెంబర్‌ 27న విడుదల కాగా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.510 కోట్లుపైగా (గ్రాస్) కలక్షన్స్‌ సాధించింది. ఈ సినిమా సూపర్ హిట్ అవడమే కాక కలక్షన్స్‌లోనూ సరికొత్త రికార్డ్ సృష్టిస్తుండటంతో జూ.ఎన్టీఆర్‌ అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. తమ అభిమాన హీరో సినిమా దేవరకి మద్దతుగా సోషల్ మీడియాలో #దేవర పేరుతో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. 

కొరటాల శివ, జూ.ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లోనే దేవర రెండో భాగం కూడా తీస్తున్న సంగతి తెలిసిందే.అది మొదటి భాగం కంటే ఇంకా అద్భుతంగా ఉంటుందని, ఇంకా అభారీ బడ్జెట్‌తో తీస్తామని దర్శకుడు కొరటాల శివ ఇదివరకే ప్రకటించారు. అయితే ఇప్పటికిప్పుడు ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యే అవకాశం లేదు కానీ 2025, డిసెంబర్‌లోగా షూటింగ్‌ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.