ఇడ్లీ కొట్టులో నిత్యా మీనన్

దక్షిణాది సినీ నటులలో జాతీయ అవార్డు అందుకున్నవారిలో నిత్యా మేనన్ ఒకరు. ఆమె అందరూ హీరోయిన్లలా గ్లామర్ పాత్రలు చేయకుండా ప్రత్యేకమైన పాత్రలు ఎంచుకొని నటిస్తుంటారు. తాజాగా ఆమె తమిళంలో ఇడ్లీ కడై (ఇడ్లీ కొట్టు) అనే సినిమాలో నటించబోతున్నట్లు స్వయంగా తెలిపారు. కొత్త ప్రకటన... కొత్త ప్రయాణం... ఇడ్లీకడై అంటూ సోషల్ మీడియాలో ఆ సినిమా ఫోటోని అభిమానులకు షేర్ చేశారు. 

గ్రామీణ నేపధ్యంలో సాగే ఈ సినిమాని ప్రముఖ తమిళ నటుడు ధనుష్ స్వయంగా నిర్మించి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, షాలినీ పాండే, నిత్యా మేనన్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమై శరవేగంగా సాగుతోందని నిత్యా మేనన్ తెలియజేశారు. ఈ సినిమా తెలుగులో ఇడ్లీ కొట్టు పేరుతో విడుదలవుతుంది.