
సోషల్ మీడియాలో అడుగుపెడితే ఎంత వద్దనుకున్నా కొంత బురద అంటుకోకుండా ఉండదు. సెలబ్రేటీలకైతే మరికాస్త ఎక్కువే అంటుకుంటుంది. అనన్య నాగళ్ళ ఇటీవల ప్లాస్టిక్ వాడకం తగ్గిద్దామంటూ చిన్న వీడియో షేర్ చేశారు. దానిలో ఆమె కొబ్బరిబొండాం నీళ్ళు త్రాగేందుకు తాను ఓ స్టీల్ స్ట్రా బ్యాగులో పెట్టుకొని దానిని మాత్రమే వాడుతానని, ఒకవేళ అది లేకపోతే ప్లాస్టిక్ స్ట్రా వాడకుండా నేరుగా ఇలా తాగుతానంటూ చిన్న వీడియో పోస్ట్ చేశారు. అందరూ ప్లాస్టిక్ వినియోగం తగ్గిద్దామని చెప్పారు.
చాలా మంది ఆమెను అభినందించగా కొందరు వెటకారంగా వ్యాఖ్యలు చేశారు. వాటిపై ఆమె వెంటనే స్పందిస్తూ, “నాకు తోచిన మంచి విషయం నలుగురితో పంచుకున్నాను. నచ్చితే పాటించండి లేకుంటే లేదు. ప్రతీ చిన్న విషయానికి ఇంత నెగెటివిటీ ఎందుకు? అంటూ అనన్య నాగళ్ళ అసహనం వ్యక్తం చేశారు. నిజమే కదా?
అచ్చ తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ళ 2019లో మల్లేశం సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టి మొదటి చిత్రంతోనే మంచిపేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ప్లే బ్యాక్, వకీల్ సాబ్, శాకుంతలం, మళ్ళీ పెళ్ళి సినిమాలు చేశారు. ఆమె తాజా చిత్రం పొట్టేల్ అక్టోబర్ 25న విడుదల కాబోతోంది.