దేవర కలక్షన్స్‌ 500 కోట్లు!

కొరటాల శివ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ జంటగా చేసిన దేవర సినిమా సెప్టెంబర్‌ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కేవలం 16 రోజులలో దేవర రూ.500 కోట్లు కలక్షన్స్‌ రాబట్టిందని ఎన్టీఆర్‌ ఆర్ట్స్ ట్విట్టర్‌లో ప్రకటించింది. 

దేవర సినిమా షూటింగ్‌ సగం పూర్తయిన తర్వాత ఈ సినిమాని రెండు భాగాలుగా తీస్తున్నామని ప్రకటించారు. తొలి భాగం సూపర్ హిట్ అవడంతో దేవర-2 అంతకంటే అద్భుతంగా తీస్తామని దర్శకుడు కొరటాల శివ, జూ.ఎన్టీఆర్‌ చెప్పారు. దేవర మొదటి భాగంలో చూసింది కేవలం 10 శాతం మాత్రమే అని రెండో భాగంలో 100 శాతం చూపిస్తామని చెపుతున్నారు. 

కానీ దేవర రెండో భాగం షూటింగ్‌ మొదలు పెట్టేందుకు మరో ఏడాది సమయం పట్టవచ్చని తెలుస్తోంది. ఆలోగా జూ.ఎన్టీఆర్‌, కొరటాల శివ ఇద్దరూ వేర్వేరుగా రెండు సినిమాలు చేయబోతున్నారు. జూ.ఎన్టీఆర్‌, రుక్మిణీ వసంత్ జోడీగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు.