బోయపాటి-బాలయ్య కాంబినేషన్లో సింహా, లిజండ్, అఖండ మూడు సినిమాలు వచ్చాయి. మూడూ కూడా సూపర్ హిట్లే. కనుక వారి కాంబినేషన్లో మరో సినిమా అంటే అభిమానులకు పండగే.
ఇవాళ్ళ దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో బోయపాటి-బాలయ్య సినిమాకి పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇది వారి కాంబినేషన్లో నాలుగో సినిమా కనుక ‘బీబీ4’ వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ సినిమాని 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట కలిసి నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబందించి పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.
బాలకృష్ణ ‘భగవంత్ కేసరితో హిట్ కొట్టిన తర్వాత బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, ఊర్వశీ రౌతేలా తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు స్క్రీన్ ప్లే: కె. చక్రవర్తి రెడ్డి, డైలాగ్స్: భాను, నందు, సంగీతం: తమన్, కెమెరా: విజయ్ కార్తీక్ కణ్ణన్, ఎడిటింగ్: నిరంజన్ దేవరమనే చేస్తున్నారు.
ను సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకార స్టూడియోస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు.
The sensational announcement on the auspicious occasion of Vijaya Dashami 💥💥#BB4Muhurtham on October 16th at 10 AM ✨
— 14 Reels Plus (@14ReelsPlus) October 12, 2024
The massive epic combination will begin its grand journey 💥💥
Team #BB4 Wishes you all a very Happy Dussehra.
'GOD OF MASSES' #NandamuriBalakrishna… pic.twitter.com/xFoCGAGVWM